Rusfertide | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు కొత్త మందు కనుగొన్నారు. ‘రస్ఫర్టైడ్’ అనే ఔషధం మంచి ఫలితాలనిస్తున్నదని, ఎర్ర రక్త కణాల అదనపు ఉత్పత్తిని తగ్గిస్తున్నదని పేర్కొన్నారు. అమెరికాలో మౌంట్ సినాయ్‌లోని ఇకాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల నేతృత్వంలో 70 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించారు. రస్ఫర్టైడ్ అనే ఔషదం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందని, దీం తో పాలీసిథేమియా వేరా అనే ఒక విధమైన బ్లడ్ క్యాన్సర్‌ను నియంత్రిస్తున్నట్టు నిరూపితమైందని పరిశోధకులు చెప్పారు.