శంషాబాద్ రూరల్ : గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రషీద్‌గూడ గ్రామ సర్పంచ్ మంచాల రాణిరవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.
గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల భవనం, సీసీరోడ్లు, అండర గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అవసరమైన నిధులు కేటాయిస్తామని హామి ఇచ్చిన్నట్లు తెలిపారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్ గౌడ్, ఉప సర్పంచ్ జగన్మోహన్రెడ్డి,వార్డు సభ్యులు మల్లారెడ్డి,యాదయ్య, కళ్యాణ్‌రెడ్డి, మంచాల సుధాకర్,బాల్‌రాజ్ తదితరులు ఉన్నారు.