హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు (Fourth Class Employees ) వేతన సవరణలో 51 శాతం ఫిట్మెంట్(Fitment) ప్రకటించాలని కేంద్ర సంఘం ప్రతినిధులు వేతన సవరణ సంఘానికి విన్నవించింది. పెరిగిన ధరలు, జీవన వ్యయం దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు బేసిక్ పే రూ. 35 వేలు ఉండేటట్లు చూడాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ తదితరుల నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర వేతన సవరణ సంఘం చైర్మన్ ఎన్.శివశంకర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. నాలుగో తరగతి ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్(Special Grade) ఇంక్రిమెంట్ పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు దర్శా నాయక్, ఖాదర్ బిన్ హాసన్ , కే. ధన్ రాజ్, బి.రాజేందర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.