Ration Shops | మేడ్చల్, జనవరి4(నమస్తే తెలంగాణ): రేషన్ దుకాణాల భర్తీ ఎప్పుడంటూ రేషన్‌కార్డుదారులు ప్రశ్నిస్తున్నా రు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 27 రేషన్ దుకాణాలు ఖాళీలు ఏర్పడిన ఇప్పటి వరకు రేషన్ దుకాణాలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా రు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలో ఆహార భద్రత కార్డులు 5,06,125, అంత్యోదయ ఆహార భద్రత కార్డు లు 1,76,75, అన్నపూర్ణ ఆహార భద్రత కార్డులు 99 ఉన్నాయి. 619 రేషన్ దుకాణాలు ఉండగా ఇందులో 27 ఖాళీలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో రేషన్ దుకాణాల ఖాళీలతో మరొక ప్రాంతంలో ఉన్న రేషన్ దుకాణాలకు బదిలీ చేసిన నేపథ్యంలో రేషన్‌కార్డుదారులకు దూర భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రేషన్‌కార్డుదారులకు 10,017,150 మెట్రిక్ టన్ను ల బియ్యం అందిస్తుండగా 17,675 మెట్రిక్ టన్నుల చక్కరను అందిస్తున్నారు.
జిల్లాలో రేషన్ దుకాణాల ఖాళీలు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బాచ్‌పల్లిలో-2, ఘట్కేసర్-1, కీసర-3, మేడ్చల్-4, బాలానగర్ సర్కిల్-2, ఉప్పల్‌లో-14 ఖాళీలున్నాయి. ప్రభుత్వం సం క్రాంతి తర్వాత రేషన్ నూతన రేషన్ కార్డులు జారీ చేస్తామన్న ప్రకటన మేరకు ఇన్ని రేషన్ దుకాణాలు ఖాళీగా ఉంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకరంగా మారింది.
1,89 లక్షల దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామన్న హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. గతేడాది ప్రజాపాలన పేరిట వివిధ పథకాల కోసం ప్రజల నుంచి 1,89 లక్షల దరఖాస్తులు వచ్చాయి.