22ఏ నుంచి తొలగించండి.. సీసీఎల్ఏ కమిషనర్‌ను కలిసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన నిజమైన ఆస్తులను జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సచివాలయంలో సీసీఎల్ కమిషనర్ లోకేష్‌ను మంగళవారం కోరారు.
మేడ్చల్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన నిజమైన ఆస్తులను జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సచివాలయంలో సీసీఎల్ కమిషనర్ లోకేష్‌ను మంగళవారం కోరారు. నియోజకవర్గంలోని వివిధ కాలనీల సర్వే నెంబర్లు, ప్రైవేట్ ఆస్తుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న దృష్ట్యా చట్టబద్దంగా కొనుగోలు చేసిన, స్వంత హక్కులు కలిగి ఉన్న ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలని కమిషనర్‌ను కోరారు. ఎమ్మెల్యే సమర్పించిన పత్రాలు, వివరాలను పరిశీలించిన సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్ తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
10 వేల మంది ఆస్తి యాజమానులకు ఊరట
22ఏ నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్ల తొలగింపులో కీలక ముందడుగు పడింది. నియోజకరవర్గంలోని దేవినగర్, బలరాంనగర్, మాతృపురి కాలనీ, ఆదర్శనగర్, ఉత్తమ్‌నగర్, గౌతమ్‌నగర్, ఆర్కే శ్యామలనగర్, న్యూ విద్యానగర్, రామకృష్ణాపురం, సీతారాంనగర్ తదితర కాలనీలకు చెందిన సుమారు 10 వేల మంది ఆస్తి యజమానులు ఎదుర్కోంటున్న సమస్య పరిష్కారం కానుంది. సమస్య పరిష్కరించేలా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి నాంపల్లిలోని మైనార్టీ వెల్ఫేర్ కార్యదర్శి షఫీఉల్లాను మంగళవారం కలిశారు.
ప్రభావిత సర్వే నెంబర్లను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు వక్ఫ్‌బోర్డు పరిగణలోకి తీసుకుందని, పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత గెజిట్‌లో అవసరమైన సవరణలు చేసి అధికారిక గెజిట్‌లో ప్రచురించేందుకు తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వక్ఫ్ బోర్డు స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తూ సంబంధిత అధికారిక రికార్డులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అందజేయగా, త్వరలోనే సమస్య పరిష్కరమై రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

