హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని కొవిడ్ బాధితుల సహాయార్థం ఆక్సిజన్ బెడ్ల జాడ తెలుసుకొనేందుకు వీలుగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. https://covidtelangana.com లింక్‌ను ఓపెన్ చేసి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో, పట్టణాల్లో ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్లు ఏయే దవాఖానలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. దవాఖానలో అందిస్తున్న వసతులు తెలుసుకొనేందుకు వీలుగా హాస్పిటళ్ల ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.