ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 17: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
క్లినికల్ సైకాలజీలో పీఎస్వై.డి కోర్సు మొదటి, రెండు, మూడు, నాలుగో సంవత్సరం రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు, ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ (రెండేళ్ల కోర్సు) మొదటి సంవత్సరం పార్ట్-1, రెండో సంవత్సరం పార్ట్-2 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 20వ తేదీ వరకు, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ (సంవత్సరం కోర్సు), ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ (రెండేళ్ల కోర్సు) మొదటి సంవత్సరం పార్ట్-1, రెండో సంవత్సరం పార్ట్-2 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 20వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో 23వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
ఈ పరీక్షలను ఈ నెలాఖరు నుంచి నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఫిల్ పార్ట్-1 ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్స్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.