హైదరాబాద్, ఏప్రిల్ 23, 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష ఫలితాల్లో ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థులు సత్తా చాటారు. అశోక్‌నగర్ లోని ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో విద్యార్థులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. స్టడీ సర్కిల్ విద్యార్థులు నాలుగు దశాబ్దాలుగా ర్యాంకుల పరంపర మోగిస్తున్నట్లు తెలిపారు. రావుల జయసింహారెడ్డి ఆల్ ఇండియా 46వ ర్యాంక్, సాయి చైతన్య జాదవ్ ఆల్ ఇండియా 68వ ర్యాంక్, చక్క స్నేహిత ఆల్ ఇండియా 94వ ర్యాంక్ సాధించగా మొత్తం 27కు పైగా ర్యాంకులతో 2024 ఫలితాల్లో ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ స్థాపకుడు, చైర్మన్ ఆర్.సి.రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థుల విజయాలను చూసి గర్వంగా ఉందన్నారు. గ్రామీణ, దిగువ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి అవసరమైన మార్గనిర్దేశాన్ని అందిస్తున్నామని తెలిపారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ సంగమిత్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క అభ్యర్థికి మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చూపించిన అంకిత భావం, కృషి మిగతా విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందన్నారు. ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ యూపీఎస్సీతో పాటు స్టేట్ సర్వీస్లైన గ్రూప్-1, గ్రూప్-2లో విజేతలుగా నిలిపిందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల పేర్లు, ర్యాంకులు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు
తెలిపారు.
– ఏడీవీటీ