ముషీరాబాద్ :కొత్తరేషన్కార్డుదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం రాంనగర్ డివిజన్ దాయర మార్కెట్లో లబ్దిదారులకు తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో లాగ కాకుండా కార్డు అందిన నెలలోనే రేషన్ పంపిణీ చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో నిజమైన అర్హులను గుర్తించి పారదర్శకంగా తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ఆర్.మోజస్, ఎరం శేఖర్, నాగభూషణం, దీన్‌దయాల్‌రెడ్డి, ప్రసాద్, రుద్రప్రవీణ్, రజినీకాంత్, రాజుచారి, ఎంవి.జనార్థన్, మహేష్, శ్రవన్, శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.