బేగంపేట్ మే 13: బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్ ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడికి అరుదైన దవడ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఐదేళ్లుగా తెరచుకోని నోటిని శస్త్రచికిత్స ద్వారా తెరుచుకునేలా చేశారు డాక్టర్ నిశాంత్ సాధనాల బుధవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్ధిపేటకు చెందిన కరుణాకర్ కుమారుడు యశ్వంత్ పుట్టినప్పటి నుంచి నోరు తెరవలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. వయస్సు పెరుగుతున్న కొ ద్ది సమస్య తీవ్రమవుతూ వచ్చింది. నోరు తెరవలేని పరిస్థితి..ఆహారం తినాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుండేది. స్లీవ్ ఆప్నియాతో సరిగ్గా నిద్రపోలేని స్థితిలో ఉన్నాడు.
బాలుడి పేరెంట్స్ ఇటీవల కిమ్స్-సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. దవడ ఎదుగుదల ఆగిపోవడంతో నోరు తెరచుకోకపోడవం, నోటి కదలికలు ఆగిపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలను వైద్యులు గుర్తించారు. పాస్టిక్ అండ్ రీ కన్స్స్ట్రక్టివ్ సర్జన్ వైద్యులు నిశాంత్ సాధనాల ఆధ్వర్యంలో బాలుడికి యాంకిలోసిస్ రిలీఫ్ విత్ కోస్టోకాండ్రల్ గ్రాస్ట్ రీ కన్సస్ట్రక్షన్ శస్త్ర చికిత్స ద్వారా దవడను సరిచేశారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సకు 5 గంటల సమ యం పటిందని, బాలుడి నోరు సాధారణ స్థాయిలోనే తెరుచుకుంటున్నదని వైద్యులు తెలిపారు.