LB Nagar | ఎల్బీనగర్ : ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్‌లో 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం ఈ నెల 13న రంగారెడ్డి జిల్లా జట్టు ఎంపిక ఉంటుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవికుమార్, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కబడ్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల, బాలిక జట్ల ఎంపిక గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని పేర్కొన్నారు.
ఎంపిక పోటీల్లో గెలుపొందిన వారే జిల్లా జట్టు తరఫున వికారాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ క్రమంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని కోరారు. బాలబాలికలు 55 కేజీల్లోపు ఉండాలని.. 01-04-2009 తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఆధార్ కార్డ్‌ను వెంట తీసుకోరావాలని కోరారు. ఈ మేరకు జే చంద్రమోహన్ (7661992581), ఈ రాజు 90000 38272 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.