హైదరాబాద్ : రంజాన్ ( Ramadan ) పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రార్ధనలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో ప్రార్ధనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, బాలరాజ్, ఫాజిల్, ఖలీల్, జమీర్, గోపిలాల్ చౌహన్, వనం శ్రీనివాస్, సమి ఉల్లా తదితరులు ఉన్నారు.