GHMC | బండ్లగూడ, ఏప్రిల్ 26 : జిహెచ్ఎంసి పరిధిలోని దుకాణదారులు రోడ్లపై చెత్త వెయ్యకుండా అవగాహన కల్పించాలని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఎస్ఎఫ్ఏలను ఆదేశించారు. శనివారం జిహెచ్ఎంసి కార్యాలయంలో ఆయన ఎస్ఎఫ్ఏలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రతి దుకాణదారుడు రెండు చెత్త డబ్బాలను వినియోగించాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వెయ్యకుండా చెత్త డబ్బాలను ఉపయోగించాలన్నారు. ఒకవేళ ఏ దుకాణదారుడైన రోడ్లపై చెత్తను వేస్తే రూ. 1000 నుంచి రూ. 5000ల వరకు జరిమానాలను విధించాలని ఆదేశించారు. రెండో సారి అదే తప్పు చేస్తే రెట్టింపులో జరిమానాలను విధించాలని లేదా దుకాణదారుడి లైసెన్స్ ను రద్దు చేయాలని తెలిపారు. ఈ ఆదేశాలపై దుకాణదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ఒక్కో వార్డుకు ముగ్గురితో కూడిన రెండు టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాణిజ్య దుకాణాలకు సంబంధించి ఏఎమ్హెచ్ఓ చూస్తారని తెలిపారు.