Hyderabad | హైదరాబాద్ : దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. మరోపక్క ఉత్తర ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం గరిష్టంగా 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కనిష్టంగా 27.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.