Hyderabad | హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీన పడింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.