Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం దంచికొట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నగర వ్యాప్తంగా ఎండ దంచికొట్టింది. ఒక్క గంటలోనే నగరమంతా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆకాశం మేఘావృతమైంది. అనంతరం పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఈ వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, ముషీరాబాద్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ, రాంనగర్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.