హైదరాబాద్ : ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అది కూడా హైదరాబాద్ ఉత్తర భాగంలో భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న రాత్రి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే.
జులై 6వ తేదీ వరకు నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ మాసంలో నగరంలో 84.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో సాధారణ వర్షపాతం 109. 2 మి.మీ. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో.. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 7.5 మి.మీ. నుంచి 15 మి.మీ. మధ్య వర్షపాతం కురిసే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.
Rains likely in #Hyderabad city after 6.00PM, northern parts high chance again. Will give one more update soon
— Telangana Weatherman (@balaji25_t) July 2, 2022