సిటీబ్యూరో: గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఉక్కపోతతో చెమటలు పట్టిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తున్నది. బుధవారం అత్యధికంగా హైదర్‌నగర్‌లో 3.65, శంషిగూడలో 2.68, మహదేవ్‌పురం,
బాలాజీనగర్‌లో 2.25, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, షేక్‌పేట, ఖైరతాబాద్ తదితర ప్రాం తాల్లో 1.75 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రెండు రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.