Rain | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. జగద్గిరిగుట్ట, చింతల్, బాలానగర్, చంపాపేట్, సరూర్‌నగర్, చైతన్యపురిలో వానపడింది. సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్లతో వర్షం కురవగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, చిలకలగూడ, మారేడుపల్లితో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
గాలులతో హైకోర్టు సమీపంలో చెట్టు నేలకొరిగింది. దాంతో ముగ్గురికి గాయాలయ్యాయి. సిటీ కాలేజీ వెనుక వైపున రోడ్డులో చెట్టు కూలడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. పొద్దంతా ఎండలు దంచికొట్టాయి. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో జనమంతా ఎండవేడి నుంచి ఉపశమనం కలిగింది.