Hyd Rains | హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం వేకువ జామున భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, కవాడిగూడ, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, సుచితతో పలు చోట్ల వర్షం పడుతున్నది. మేహదీపట్నం పరిధిలోని గుడిమల్కాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. మరో వైపు రాగల ఐదురోజుల పాటు హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.