Rain | సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10 గంటల వరకు కుత్బుల్లాపూర్‌లో 2.20సెం.మీలు, పటాన్‌చెరువులో 2.18, కూకట్పల్లి శంషీగూడలో 1.53, గాజులరామారంలో 1.23, హైదర్‌నగర్‌లో 1.13సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం మరింత బలపడి వాయుగుండగా మారే అవకాశాలు ఉండటంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు. భారీ వానల నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో గరిష్ఠం 31.0, కనిష్ఠం 3.6 డిగ్రీలు, గాలిలో తేమ 90 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.