సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో పక్క పగలు సమయంలో ఎండలు దంచికొడుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోత సమస్య తగ్గలేదు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.4డిగ్రీలు, గాలిలో తేమ 39శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.