సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): విదర్భ నుంచి తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో పక్క నగరంలో ఎండలు దంచి కొడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 39.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 29.0డిగ్రీలు, గాలిలో తేమ 42 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.