Rain Alert | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ కురుస్తున్నది. సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా వాతావరణం ఉండగా.. ఒక్కసారిగా నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట, రహమత్‌నగర్, బోరబండ, రాంనగర్ ముషీరాబాద్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం కురుస్తున్నది.
అలాగే నారాయణగూడ, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరగా.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉండగా.. వర్షాలపై జీహెచ్ఎంసీ ప్రజలను అప్రమత్తం చేసింది. రేపు ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసర సమయాల్లో 900113667, 040-2111 1111 నంబర్లలో సంప్రదించాలని కోరింది.