Bill Gates | ప్రభుత్వాలు అప్రమత్తం కాకపోతే ఏఐతో భారీ ప్రమాదం.. హెచ్చరించిన బిల్ గేట్స్
Bill Gates | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (Microsoft founder) బిల్ గేట్స్ అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రభుత్వాలు గనుక త్వరితగతిన అప్రమత్తమై నిబంధనలు తీసుకురాకపోతే మానవ సమాజానికి భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
Bill Gates : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (Microsoft founder) బిల్ గేట్స్ (Bill Gates) అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రభుత్వాలు గనుక త్వరితగతిన అప్రమత్తమై నిబంధనలు తీసుకురాకపోతే మానవ సమాజానికి భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. గత సాంకేతిక విప్లవాలు ఉద్యోగ అవకాశాలను పెంచినప్పటికీ, ఏఐ విప్లవం మాత్రం అందుకు పూర్తి భిన్నమైనదని గేట్స్ స్పష్టంచేశారు.
ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగైపోతాయని, కేవలం కొన్ని రంగాలు మాత్రమే మానవులకు ఉపాధిని ఇవ్వగలవని తెలిపారు. ఏఐ కోడింగ్ సామర్థ్యాలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, నిపుణులైన మనుషుల కంటే మెరుగ్గా పనిచేస్తున్న ఈ సాంకేతికతవల్ల సమీప భవిష్యత్తులోనే ఉపాధి రంగంలో తీవ్ర సంక్షోభం రానుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ కంపెనీలు దీనివల్ల వచ్చే ముప్పును తక్కువ చేసి చూపిస్తున్నాయని, పెట్టుబడులు తగ్గిపోతాయనే భయంతో అసలు ఆందోళనలను బహిరంగంగా అంగీకరించడం లేదని విమర్శించారు.
మనుషుల ఉపాధిని కాపాడేందుకు గేట్స్ కొన్ని సంచలనాత్మక ప్రతిపాదనలు చేశారు. ఏఐ, రోబోలను ఉపయోగిస్తూ మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించే కంపెనీలపై ప్రత్యేక పన్ను (Robot/AI Tax) విధించాలని, ఆ ఆదాయంతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని సూచించారు. అలాగే కొన్ని రంగాలను కేవలం “మనుషులకు మాత్రమే పరిమితం” చేయాలని, ఉదాహరణకు వైద్యరంగంలో రోగికి వ్యాధి వివరాలు చెప్పడం లేదా కేర్ గివింగ్ వంటి బాధ్యతలను మనుషులే నిర్వహించేలా చట్టాలు తేవాలని ప్రతిపాదించారు.
అంతేకాకుండా జీవాస్త్రాలు లేదా కొత్త రకం రసాయన ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు ఏఐని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అణు ఆయుధాలు, అంతర్జాతీయ విమానయానానికి ఉన్నట్లే ఏఐ వినియోగం, నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఒప్పందాలు, పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు కావాలని సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

