Lenin | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని అఖిల్ లైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జులై 10న గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ అఖిల్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. థ్రియాట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది.
కాగా ఇప్పుడు లెనిన్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. లెనిన్‌ను మరింత ఎక్కువమంది వీక్షించేలా మరో ఓటీటీ ప్లాట్‌ఫాం జియో హాట్ స్టార్‌లో కూడా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న లెనిన్ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌తోపాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించారు.
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శివాజీ, సునీల్ కీ రోల్స్‌లో నటించగా..ఈశ్వరీరావ్, బ్రహ్మాజీ, ప్రమోద్ పంజు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు.