Union Govt | దేశంలో చక్కెర కొరత లేదు.. స్పష్టంచేసిన కేంద్రం
Union Govt | దేశంలో చక్కెర కొరత (Sugar Shortage) లేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) స్పష్టంచేసింది. అక్టోబర్‌లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇథనాల్ ఉత్పత్తికి చక్కెర మళ్లింపు తగ్గిందని, ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇథనాల్ కార్యక్రమం కారణం కాదని పేర్కొన్నది.
Union Govt : దేశంలో చక్కెర కొరత (Sugar Shortage) లేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) స్పష్టంచేసింది. అక్టోబర్‌లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇథనాల్ (Ethanol) ఉత్పత్తికి చక్కెర మళ్లింపు తగ్గిందని, ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇథనాల్ కార్యక్రమం కారణం కాదని పేర్కొన్నది. 2022-23 లో ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26 లో అది 9 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడొంతుల వాటా ధాన్యాలు, ముఖ్యంగా మొక్కజొన్న నుంచే వస్తోందని వివరించింది. ఇదిలావుంటే ఇటీవల చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. జూలై 20న కిలో రూ.48.18 గా ఉన్న చక్కెర ధర ఆగస్టు 20 నాటికి రూ.55.70 కు చేరింది. అంటే నెల రోజుల్లో సుమారు 15.6 శాతం పెరిగింది. అయితే 2024 ఆగస్టు నుంచి 2026 జూలై వరకు వినియోగదారుల రిటైల్ చక్కెర ధరలు ఏటా సగటున కేవలం 3 శాతం మేర మాత్రమే పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుత ధరల పెరుగుదలకు దేశీయ ఉత్పత్తి అంచనాల కంటే తగ్గడం, పండుగల సీజన్‌కు ముందు డిమాండ్ పెరగడం, అధిక వర్షాలతో చెరకు పంట దెబ్బతినడం వంటి కారణాలు ఉన్నాయని వివరించింది. చెరకు పంటలో రెడ్ రాట్, టాప్ బోరర్ వంటి తెగుళ్లతోపాటు నీటిముంపు కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొన్నది. అంతర్జాతీయంగా చక్కెర సరఫరాలు తగ్గడం, ధరలు పెరగడం, కొందరు వ్యాపారులు నిల్వలు చేయడం, మార్కెట్లో ఊహాగానాలు కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలిపింది.
ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి తొలుత అంచనా వేసిన 343 లక్షల టన్నులతో పోలిస్తే 306 లక్షల టన్నులకు పరిమితం కావచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అయినప్పటికీ దేశీయ వినియోగానికి అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేసింది. భారత్‌లో సాధారణంగా ఏటా 300-340 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కాగా, దేశీయ వినియోగం 280-290 లక్షల టన్నులుగా ఉంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర సరఫరా ఒత్తిడిలో ఉందని ప్రభుత్వం పేర్కొన్నది.
2026-27లో ప్రపంచ చక్కెరలోటు సుమారు 33 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. జూన్ 30న టన్నుకు 474 డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ చక్కెర ధర ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు పెరిగిందని తెలిపింది. ఇథనాల్ కార్యక్రమం చెరకు రైతులకు, చక్కెర మిల్లులకు ప్రయోజనం చేకూర్చిందని కేంద్రం పేర్కొన్నది. మిగులు చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా చక్కెర మిల్లుల వద్ద నిధులు నిలిచిపోకుండా, రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడగలిగామని వివరించింది.
చెరకు సాగు విస్తీర్ణం 2015-16లో 49.27 లక్షల హెక్టార్ల నుంచి 2025-26లో 58.87 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపింది. 2025-26 చక్కెర సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల్లో ఇప్పటికే 97 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో అవి ప్రభుత్వ సాయంపై ఆధారపడటం కూడా తగ్గిందని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

