
సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా ఎండలతో మండిపోతున్న నగరం రుతుపవనాలు బలపడడంతో సోమవారం కురిసిన భారీ వర్షంతో తడిసి ముైద్దెంది.గ్రేటర్ పరిధిలోని మల్లాపూర్ బయోడైవర్సిటీ ప్రాంతంలో రాత్రి 8.30గంటల వరకు అత్యధికంగా 8.8సెం.మీల వర్షపాతం నమోదవగా, జుమ్మెరాత్‌బజార్‌లో అత్యల్పంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల మరో రెండు రోజులు గ్రేటర్ వ్యాప్తంగా మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సహాయక చర్యలు వేగిరం..
భారీ వానతో తలెత్తిన ఇబ్బందులకు తక్షణ పరిష్కారం చూపేందుకు128 స్టాటిక్, ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని వెంట వెంటనే క్లియర్ చేశారు.గ్రీవెన్స్ సెల్‌కు ప్రజల నుంచి 47 ఫిర్యాదులు అందగా, 13 చోట్ల పరిష్కారం చూపామని 34 చోట్ల పనులు పురోగతి ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఎలాంటి సమస్యలు ఎదురైనా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నం. 21111111, 100కు, ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల వాట్సాప్, హాక్ ఐలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.