సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): ఇల్లంటే స్వర్గసీమ. కలకాలం హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించేలా.. మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్నిచ్చేదిగా ఉండాలని కోరుకుంటారు. సరిగ్గా అలాంటి వాతావరణాన్ని నివాసం ఉంటున్న చోట అందరికీ కలిగించాలన్న లక్ష్యంతోనే బాలానగర్‌లో ‘రఘురామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ’ ఏ2ఏ హోమ్‌ల్యాండ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. అందమైన గృహ నిర్మాణాలకు ఎంతో గొప్పదనాన్ని అపాదిస్తూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును హైదరాబాద్ నగర వాసులకు పరిచయం చేస్తోంది. బాలానగర్‌లో చాలా ఎకరాల పచ్చదనంతో కూడిన ప్రాంతానికి చేరువలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నదిగా ఉన్నది. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే వారికి ఏం కావాలో అదే అందించేలా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 7 బ్లాకుల్లో మొత్తం ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం గల 2 క్లబ్ హౌస్‌లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.
ఒక్కో ప్లాట్ సైజు 1700 చదరపు అడుగుల నుంచి 2260 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే నగరంలోనే సరికొత్త కాన్సెప్ట్‌తో చేపడుతున్న ప్రాజెక్టుగా చెబుతున్నారు. మహానగరాల్లో అపార్టుమెంట్లే చాలా మందికి అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత గృహాలు కొనుగోలు చేయడం భారంగా ఉన్నది. అందుకే మెజారిటీ ప్రజలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లనే కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు అపార్ట్మెంట్లలో ఓ ఫ్లాటు ఎంపిక అంటే ఒక రెడిమెడ్ దుస్తులను ఎంచుకోవడమే అన్నట్లుగా మారింది. కొనుగోలుదారుల అభిరుచికి ఏ మాత్రం అవకాశం లేకుండా నిర్మాణ సంస్థలే పూర్తిస్థాయిలో డిజైన్లు సిద్ధం చేసి వారి ముందుంచుతున్నాయి. దీంతో వారు తమ అభిరుచిని బట్టి తమ అపార్ట్మెంటు, అందులోని ఫ్లాట్‌లో ఉండాలనుకున్నా సాధ్యమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పోకడలను గుర్తించి సరికొత్త విధానంలో ఒక ప్రాజెక్టును నిర్మిస్తోంది. నిర్మాణ రంగంలో 37ఏండ్ల అనుభవం ఉన్న రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నేటి కొనుగోలుదారుల అభిరుచులకు పెద్దపీట వేస్తూ, విభిన్న రకాల మౌలిక వసతులను అదనంగా కల్పిస్తూ ఈ ప్రాజెక్టును చేపట్టింది.
నగరవాసుల అభిరుచి మారుతోంది.. తమకు నచ్చిన మౌలిక వసతులు ఉన్న నివాసం కోసం ఎంతో ఆసక్తిగా శోధన చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో మెరుగైన జీవనశైలి ఉండే ప్రాజెక్టులను వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నచిన్న అపార్ట్మెంట్లు(స్టాండలోన్) నుంచి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వంటి ప్రాజెక్టుల పట్ల అధిక ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి వారి అభిరుచికి తగ్గట్టుగానే కోర్ సిటీలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని బాలానగర్ రఘురామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఏ2ఏ హోమ్‌ల్యాండ్ పేరుతో 20కి పైగా మౌలిక వసతులతో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. కూకట్పల్లి, సనత్‌నగర్, బాలానగర్ ప్రాంతాలకు సమీపంలో ఐడీపీఎల్ కాలనీ ఎదురుగా ఈ ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలు, ప్రణాళికతో నిర్మిస్తున్నామని, ఫ్లాట్‌కు ఫ్లాట్‌కు మధ్య కామన్ వాల్ లేకుండా వాస్తుకు అనుకూలంగా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రత్యేకంగా లాంజ్, హెల్త్ క్లబ్, ఇండోర్ గేమ్ ఏరినా, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్‌పూల్ వంటివి ప్రధానంగా ఉంటాయని తెలిపారు. కేప్టేరియా, టాడ్లర్ ప్లే, లర్నింగ్ సెంటర్, మినీ బోర్డు రూమ్, గెస్ట్ రూమ్, బిజినెస్ లాంజ్, మల్టీపర్పస్ హాలు, కన్వీయెన్స్ స్టోర్, కిడ్స్ ప్లే ఏరియా, సెలూన్, లైబ్రరీ, డాన్స్ స్టూడియో, సీనియర్ సిటిజన్ లాంజ్, జిమ్, ప్రివ్యూ థియేటర్, బ్యాడ్మింటన్ కోర్టు, యోగా, మెడిటేషన్ ఏరియా… ఇలా రకరకాల వసతులు ప్రాజెక్టు లోపలే ప్లాట్ల యజమానులందరికీ అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్నారు.
బాలానగర్ కేంద్రంగా ఉన్న ఈ ప్రాజెక్టు నగరంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు బాలానగర్ మెట్రో స్టేషన్ సైతం ఉన్నది. దీంతో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, మాల్స్ వంటివి సమీప ప్రాంతాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్న బాలానగర్‌కు రోడ్డు మార్గంలోనూ అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు రెరా అనుమతి పొంది ఉంది. మరిన్ని వివరాలకు ఫోన్ : 7070787979 లపై సంప్రదించవచ్చు.