రాధాకిషన్‌రావుకు మరో ఐదు రోజులు అనుమతి
తల్లి మరణాంతరం నిర్వహించే కార్యక్రమాల్లో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు పాల్గొనేందుకు 5 రోజులు అనుమతిస్తూ 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 నుంచి 14 వరకు తల్లికి నిర్వహించే కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు ఈ అవకాశాన్ని కోర్టు కల్పించింది.
నాంపల్లి కోర్టులు, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : తల్లి మరణాంతరం నిర్వహించే కార్యక్రమాల్లో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు పాల్గొనేందుకు 5 రోజులు అనుమతిస్తూ 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 నుంచి 14 వరకు తల్లికి నిర్వహించే కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు ఈ అవకాశాన్ని కోర్టు కల్పించింది. పూజలో పాల్గొనే సమయంలో భద్రత పేరిట అధికారులు నిర్భందించరాదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి.. పల్లగుట్ట గ్రామంలో 2న ముగిసిన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు 2 రోజులపాటు అనుమతిచ్చింది. అయితే, చంచల్‌గూడ జైలు అధికారులు మాత్రం భద్రత పేరిట కుటుంబీకులను, భార్యను కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదంటూ ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏడు రోజుల కోసం అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. రెండు రోజులకు అనుమతిచ్చిందని, మరో 5 రోజులకు అనుమతివ్వాలని కోరారు. స్వేచ్ఛగా తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు వెసులుబాటు కల్పించలేదన్నారు. హ్యాండ్కప్స్తో నిందితుడి చుట్టూ పోలీసుల భద్రత కొనసాగిందని, స్వేచ్ఛగా నిందితుడు కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కోర్టు అనుమతివ్వాలని విన్నవించారు. అంత్యక్రియల సందర్భంగా అధికారులు ఎందుకలా వ్యవహరించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డిని ప్రశ్నించారు. అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, స్వేచ్ఛగా వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని పీపీ కోర్టుకు తెలిపారు. 10, 11వ రోజులు ముఖ్యమైనవని, ఆ రెండు రోజులకు అనుమతి కోరినట్లయితే సమంజసంగా ఉంటుందన్నారు. కావాలని పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని, 5 రోజుల పాటు నిందితుడికి అనుమతివ్వకూడదని పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

