సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసులు ఇటీవల నకిలీ సర్టిఫికెట్ల ముఠాకు చెందిన 13 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని రెండు రోజుల పాటు విచారణ కోసం పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో శుక్రవారం అరెస్టయిన వారిని సరూర్నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.
వివిధ రకాలైన 571 వివిధ రకాలైన ఫేక్ డాక్యుమెంట్లను ఈ ముఠా తయారు చేసింది. అందులో గతేడాది 280 నకిలీ సేల్డీడ్స్ను పలువురికి విక్రయించినట్లు వెల్లడైంది. ఈ సేల్డీడ్లు కొనేవారు ఎవరు.. వారు ఎక్కడ వాటిని ఉపయోగించారు? వాటితో ఎన్ని వివాదాలు నడుస్తున్నాయి? ఈ నకిలీలతో కోర్టులో కేసులేసిన వారెందరు? బ్యాంకుల్లో ఈ డాక్యుమెంట్లు పెట్టి రుణాలు పొందిన వారెందరు..? ఇలా పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.