ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రారంభోత్సవంలో
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 4: క్రమ శిక్షణతో చదివి పట్టుదలతో కృషి చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచించారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ లో.. అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పీజేఆర్ ఇనిస్టిట్యూషన్ సౌజన్యంతో 3 నెలల పాటు శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. ఘట్కేసర్తో పాటు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం లో 2000 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు చెప్పారు.
పోలీసు ఉద్యోగాలకు తాము ఉచితంగా ఇస్తున్న శిక్షణ కోసం పదివేల మంది దరఖాస్తు చేసుకోగా..8వేల మంది పరీక్షలకు హాజరయ్యారని వారిలో రెండువేల మంది ఎంపికయ్యారని వెల్లడించారు. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో ప్రయత్నిస్తే పలితాలు తప్పకుండా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, అడిషనల్ డీసీపీ కుషాయిగూడ శివకుమార్, డీసీపీ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ షమీర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, అరోరా కళాశాల ప్రిన్సిపల్ మహేశ్, పీజేఆర్ ఇనిస్టిట్యూషన్ హెడ్ జనార్దన్ రెడ్డి, ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, అడిషనల్ ఇన్స్పెక్టర్ జంగయ్య, రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ఐ కృష్ణాంజనేయులు, ఎస్సైలు విజయ కృష్ణ, నాగార్జున రెడ్డి, జ్ఞానెందర్రెడ్డి. శివకృష్ణ, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
3 నెలల పాటు శ్రద్ధగా చదవండి..
చంపాపేట, మే4: రాబోయే ఎైస్సె ప్రిలిమినరీ రాత పరీక్షలో 200 మార్కులకు గాను 60 శాతం కటాఫ్ ఉండే అవకాశం ఉందని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అభ్యర్థులకు సూచించారు. బుధవారం చంపాపేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి అభ్యర్థులకు పలు సూచనలిచ్చారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి జగదీశ్వర రెడ్డి సారద్యంలో మంచి ప్యాకల్టీ ద్వారా పాఠాలు చెప్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు లక్ష్మీనారాయణ, షమీర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సరూర్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్లు సీతారాం, రవికుమార్, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.