ముషీరాబాద్, సెస్టెంబర్ 25: రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే రాజ్యసభ సభ్యత్వానికి రాజీమా చేశానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని, బీసీల తరఫున రాజ్యసభలో ప్రశ్నించినా సమధానం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలంటే పోరాటమే శరణ్యం అని, స్వాత్రంత్య వచ్చి 76 సంవత్సరాలైన బీసీలకు అన్యాయం జరుతూనే ఉందన్నారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల(BC reservation) కోసం బలమైన ఉద్యమాన్ని(BC movement) నిర్మించాల్సిన అవరం ఉందని, ఆదిశగా రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘాలతో పలు సమావేశాలు జరిగిన తరువాత బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హార్యానా, రాజస్థాన్లో జాట్ల తరహా ఉద్యమం చేయాల్సిన అవరం ఉందని, అలాయితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు అమలు జరుపుతారన్నారు.