కాచిగూడ,డిసెంబర్ 8 : బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలోని జిల్లా, మండల, గ్రామాల్లో సమరభేరి చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్‌గా కంచిగారి ప్రవీణ్‌కుమార్‌ను సోమవారం నియమిస్తూ నియామక పత్రాన్ని ఆర్.కృష్ణయ్య అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశంలో బీసీ విప్లవం తప్పదని, జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.ఈ పదవి రావడానికి సహకరించిన జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్ ర్యాగ అరుణ్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్‌కు కృతజ్ఞతలు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బాలయ్య ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు.