కాచిగూడ,సెప్టెంబర్ 9 : ప్రభుత్వం గురుకుల పాఠశాలపై(, Gurukula schools) అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) కోరారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో బీసీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఫీజుల బకాయిలు రూ.1525 కోట్లు విడుదల చేయడం శుభచూచికమని, మిగతా 3 వేల కోట్ల రూపాయాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడిగా చూడాలని, ఖర్చుగా భావించరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభు త్వం ప్రకటించడంపై స్పష్టమైన విధి విధానాలను ప్రకటించాలని పేర్కొన్నారు. బీసీలకు 330, ఎస్సీలకు 246, ఎస్టీలకు 140, మైనార్టీలకు 206 గురుకులలు ఉన్నట్లు..ఇందులో బీసీ విద్యార్థులకు ఎన్ని ఇస్తారో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా జనర్ధాన్, మల్లేశ్‌యాదవ్, నీల వెంకటేశ్, అంజి, నందగోపాల్, కీర్తిలతగౌడ్, హరితిలక్సింగ్, నిషి ముదిరాజ్, ప్రణీత, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.