స్థానిక సమస్యలకు సత్వరమే పరిష్కారం : ఎమ్మెల్యే కాలేరు
ఎమ్మెల్యే కాలేరు | తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.

గోల్నాక, సెప్టెంబర్ 6 : తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం గోల్నాక డివిజన్ మారుతీనగర్ బస్తీ వాసులు గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను కలసి తమ సమస్యలు వివరించారు.
ముఖ్యంగా మంచినీటి సమస్యతో పాటు బస్తీలో ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్తీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు.
వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి జీఎం సుబ్బారాయుడు, డీజీఎం సతీష్, ఏఈ రోహిత్‌తో పాటు మారుతీనగర్ వెల్ఫేర్ అసొసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

