మూసీ నదిబ్రిడ్జిల నాణ్యత తనిఖీ
మూసీ నదిపై ఇప్పటికే ఉన్న బ్రిడ్జీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) చర్యలు చేపట్టింది. గండిపేట నుంచి గౌరెల్లి ఔటర్ రింగు రోడ్డు దాకా పారుతున్న మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సర్వేను అధికారులు పూర్తి చేశారు.
- ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం
సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): మూసీ నదిపై ఇప్పటికే ఉన్న బ్రిడ్జీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) చర్యలు చేపట్టింది. గండిపేట నుంచి గౌరెల్లి ఔటర్ రింగు రోడ్డు దాకా పారుతున్న మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సర్వేను అధికారులు పూర్తి చేశారు.
డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం (డీజీపీఎస్) చేసి మూసీకి ఇరువైపులా సరిహద్దులను నిర్ణయిస్తున్నాయి. అదే విధంగా మూసీ నదిపై ఇప్పటికే ఉన్న బ్రిడ్జీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ నిపుణులను నియమించనుంది. గండిపేట నుంచి గౌరెల్లి దాకా పారుతున్న మూసీ నదిపై ఇప్పటికే మొత్తం 17 బ్రిడ్జీలు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రత్యేకంగా పరిశీలించి వాటి నాణ్యతపై నివేదిక ఇస్తారని అధికారులు తెలిపారు.
మూసీ నదిపై ఉన్న బ్రిడ్జీలు…
టిప్పుఖాన్ బ్రిడ్జీ (పాతది) టిప్పుఖాన్ బ్రిడ్జీ (కొత్తది) బాపూఘాట్ అత్తాపూర్ పురానాపూల్ (పాతది)
పురానాపూల్ (కొత్తది) ముస్లింజంగ్ బ్రిడ్జీ (పాతది) ముస్లింజంగ్ బ్రిడ్జీ (కొత్తది) నయాపూల్ (పాతది)
నయాపూల్ (కొత్తది) సాలార్జంగ్ బ్రిడ్జీ చాదర్ఘాట్ బ్రిడ్జీ గోల్నాక బ్రిడ్జీ నాగోల్ బ్రిడ్జీ (పాతది) నాగోల్ బ్రిడ్జీ (కొత్తది) ఇమ్లీబన్ పార్కు (లోపలి వెళ్లేది) ఇమ్లీబన్ పార్కు (బయటకు వచ్చేది)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

