బేగంపేట్, జూన్ 28 : దివంగత భారతదేశ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 102వ జయంతి వేడుకలు బుధవారం నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్‌అలీ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నాయకుడు అంజన్‌కుమార్‌యాదవ్, ఆర్డీవో వసంతకుమారి పాల్గొని పీవీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండిచి గట్టెక్కించిన గొప్ప నాయకుడని అన్నారు. ఆర్థిక సంస్కరణల జాతిపిత అని కొనియాడారు.
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి అన్నారు. నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేయడమే కాకుండా భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితిలో దేశానికి దిక్సూచిలా నిలిచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశానికే కాకుండా ప్రపంచానికే మార్గ దర్శకంగా నిలిచారని, పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఆయన పట్ల గౌరవాన్ని చాటుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జైప్రకాశ్నారాయన్, రాంగోపాల్‌పేట కార్పొరేటర్ చీర సుచిత్ర, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్‌తోపాటు మనవలు, కుటుంబసభ్యులు పాల్గొని నివాళులర్పించారు. ఈ క్రమంలో పీవీ జీవిత చరిత్రకు సంబంధించిన ఘట్టాలు, భజనలు, ప్రార్థనలు, సర్వమత ప్రార్థనలు, మెడికల్ క్యాంపు, ఉచిత ఆరోగ్య, రక్తదాన, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Pv
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు 102వ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శానస మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మండలి విప్ ఎంఎస్. ప్రభాకర్, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, సురభి వాణిదేవి, బొగ్గారపు దయానంద్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగాధర్‌గౌడ్, రమేశ్‌రెడ్డి, లెజిస్లేచర్ సెక్రటరీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు 102వ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలోపాల్గొన్న కే.ఎం.సాహ్ని,సంజయ్‌జాజు, గౌరవ్ ఉప్పల్