సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారికి అందించేందుకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అర్హులైన వారు తమ దరఖాస్తులను అందజేయవచ్చని కమిషనర్ ఆమ్రపాలి సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. అర్హులైన వారు తమ సమీపంలో ఉన్న ప్రజా సేవా కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సరిల్ పరిధిలో ప్రజా సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.