వెంగళరావునగర్: మానసిక రోగి జీవితాన్ని చక్కదిద్దాలని ప్రేమించి పెండ్లి చేసుకున్న సైకాలజిస్ట్.. చివరకు అతడి వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్‌నగర్ జెక్ కాలనీలో నివాసముండే ఓ ఠాణా సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహగౌడ్ కుమార్తె రజిత(33) సైకాలజీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా బంజారాహిల్స్‌లోని ఓ మానసిక దవాఖానలో చికిత్స పొందుతున్న కేపీహెచ్‌బీకి చెందిన రోగి ఆగు రోహిత్(33) పరిచయమయ్యాడు.
తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని నమ్మబలికాడు. రోహిత్ ఎంతో ప్రేమిస్తున్నట్లు నటించడంతో నమ్మేసి.. రజిత కూడా ప్రేమించారు. మానసికంగా రోహిత్‌ను బాగు చేసుకోవాలని సంకల్పించారు. తల్లిదండ్రులను ఒప్పించి రోహిత్‌ను పెండ్లి చేసుకున్నారు. రోహిత్.. ఏ పని చేయకుండా..జల్సాలకు అలవాటు పడ్డాడు. నగరంలోని ప్రముఖ ఇంటర్నేషనల్ పాఠశాలలో రజిత చైల్డ్ సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. రజిత జీతం డబ్బులు కూడా తీసుకుని రోహిత్ ఖర్చు చేయసాగాడు. చెడు అలవాట్లు మానుకోవాలని రజిత అనేకసార్ల్లు చెప్పినా..అతడితో మార్పు రాలేదు.
రోహిత్ తల్లిదండ్రులు కిష్టయ్య, సరేష, సోదరుడు మోహిత్ సహకరిస్తూ రజితను వేధించేవారు. డబ్బులు ఇవ్వని పక్షంతో రజితను కొట్టేవాడు. వేధింపులు తాళలేక రజిత గత నెల 16న నిద్ర మాత్రలు మింగడంతో ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. చికిత్స అనంతరం జెక్‌కాలనీలోని ఇంటికి తీసుకువచ్చారు. గత నెల జూలై 28న బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.