హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి అదికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.
తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దళిత ఐక్యవేదిక నేతలు అడ్డుకున్నారు. ముషీరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని అడ్డగించి ఎస్సీల సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ
వరుసగా కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న నిరసన సెగలు
GHMC ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పొన్నంను అడ్డుకున్న దళిత నాయకులు
ముషీరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు పొన్నంను అడ్డుకున్న… https://t.co/SQH4DuDTsW pic.twitter.com/szIbryYczl
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2026