జూబ్లీహిల్స్, జూన్ 26 : సీఎంఆర్ టెక్స్టైల్ అండ్ జ్యుయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ తెలిపారు. బుధవారం సీఎంఆర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్-2024 విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఇందులో ప్రథమ బహుమతి పొందిన గోపాలపట్నం జట్టుకు విన్నర్స్ షీల్డ్‌తో పాటు రూ.1.15 లక్షల నగదు, ద్వితీయ బహుమతి పొందిన ఉప్పల్ జట్టుకు రన్నర్స్ షీల్డ్‌తో పాటు రూ.75 వేలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు రూ.50 వేలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రూ.10 వేల నగదు బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో సీఎంఆర్ షాపింగ్ మాల్, సీఎంఆర్ జ్యుయలరీ, సీఎంఆర్ సెంట్రల్, సీఎంఆర్ ఫ్యాషన్స్, కంచి కామాక్షి, మావూరి షాపింగ్ మాల్స్ నుంచి 100 టీమ్‌లు.. 1400 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను తిరుపతి, విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్, ఒంగోలు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం వేదికలుగా నిర్వహించినట్లు తెలిపారు.