హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో బన్సీలాల్‌పేట్ డివిజనలోని చాచానెహ్రూనగర్‌కు చెందిన మహవీర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. నర్సింగ్‌రావు, కమిటీ సభ్యులు మంత్రిని కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నీళ్ల కోసం తమ బస్తీలో పవర్‌బోర్, నీటి ట్యాంక్‌లు ఏర్పాటు మంజూరు చేసినందుకు వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, బస్తీవాసుల కోసం నూతన కమ్యూనిటీ హాలు నిర్మించాలని, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. తాము వచ్చి సమస్య చెప్పగానే వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు బస్తీవాసులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కే.లక్ష్మిపతి, బస్తీ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నర్సింగ్‌రావు, సభ్యులు సయ్యద్ చాంద్, కల్యాణ్‌రామ్, సుధాకర్, అనిల్, దినేశ్, బాలకిశోర్, మురళి తదితరులు పాల్గొన్నారు.