సుల్తాన్ బజార్, మార్చి 8: ఉస్మానియా దవాఖానను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్, హెచ్ఎండీఏ జేసీఎం ఆమ్రపాలి, సీఎం ఓఎస్డీ బి.అజిత్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.నాగేందర్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు.
పాత భవనం ప్రస్తుత పరిస్థితి, భవనానికి సంబంధించిన పలు నివేదికలు, కోర్టు సమస్యలపై సూపరింటెండెంట్ బి.నాగేందర్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ అడ్మిన్ డాక్టర్ శేషాద్రి, ఆర్‌ఎంఓలు సాయిశోభ, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ కవిత, డాక్టర్ సుష్మ, డాక్టర్ జాఫర్ హష్మి, డాక్టర్ రఫి తదితరులు పాల్గొన్నారు.