Traffic alert | నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని నరేం ద్రమోదీ హైదరాబాద్ సందర్శన, పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగసభను పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీల కదలికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): నేడు (ఆదివారం) భారత ప్రధాని నరేం ద్రమోదీ హైదరాబాద్ సందర్శన, పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగసభను పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీల కదలికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
బేగంపేట ఎయిర్పోర్ట్-బేగంపేట-గ్రీన్‌ల్యాండ్స్-పంజాగుట్ట-నాగార్జున సర్కిల్-ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్-ఎస్ఎన్టీ జంక్షన్-సాగర్ సొసైటీ-ఎన్టీఆర్ భవన్-జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-పెద్దమ్మతల్లి కమాన్-రోడ్‌నెం.36/31- నీరూస్ జంక్షన్-సైబర్ టవర్స్ జంక్షన్-శిల్పారామం-హైటెక్స్ కమాన్ వద్ద కుడిమలుపు-ఎన్ఏసీ మెయిన్ గేట్-బ్లాక్ 22-ఎడమమలుపు-కాసాని గేట్-కుడిమలుపు-హెచ్ఐసీసీ చెక్‌పోస్ట్-రాక్ సర్కిల్-వీవీఐపీ అలైటింగ్పాయింట్ మరియు అదే మార్గంలో తిరిగి ప్రయాణిస్తారు.
ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రజలు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి పదిగంటల వరకు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని ఆయన కోరారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి నగర ప్రజలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11గంటల మధ్య ఎంజీరోడ్, ఆర్పీరోడ్, ఎస్డీ రోడ్డు మార్గాల్లో ప్రయాణించవద్దని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకునేవారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ముందస్తుగా బయలుదేరాలని ఆయన సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

