మన బస్తీ-మన బడి కింద మౌలిక సదుపాయాలు
స్కూళ్ల వారీగా సిద్ధమవుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు
సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’ నేపథ్యంలో జిల్లాలో 239 పాఠశాలలు అభివృద్ధికి ఎంపికయ్యాయి. ఆయా స్కూళ్లలో 12 రకాల వసతులు కల్పించనున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ యం ప్రకారం, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ వచ్చినట్లయ్యింది. దీంతో జిల్లాల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఒక్క రూపాయి చెల్లించకుం డా పూర్తిగా ఉచిత విద్యా విధానం అందుబాటులోకి రా నుంది. పైగా ఆయా పాఠశాలల్లో తెలుగు మీడియంతో పా టు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన సాఫీగా సాగడం కోసం టీచర్లకు ఇంగ్లిష్ బోధన పద్ధతుల్లో శిక్షణ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతి సదుపాయాల సంస్థ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో స్కూళ్ల వారీగా చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సి ద్ధం చేస్తున్నారు. తాగునీటి సరఫరా, నీటి సౌకర్యంతో పా టు మరుగు దొడ్లు, తరగతి గదులకు చిన్న మరమ్మతులు, పెద్ద మరమ్మతులతో పాటు విద్యుదీకరణ పనులు, మధ్యా హ్న భోజన పథకం అమలు కోసం వంట గదుల నిర్మాణా లు, స్కూల్ భవనం మంచిగా కనిపించే విధంగా రంగులు వేయడం, స్కూల్ క్యాంపస్లో హరిత బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రహరీ గోడలతో పాటు ప్రవేశ ద్వారాల నిర్మా ణం, డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, ఉన్నత పాఠశాల ల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ప్రతిపాదనలు సి ద్ధం చేయాలని జిల్లాలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశించిం ది. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా అధికారులు అన్ని ర కాల చర్యలు కొనసాగిస్తున్నట్లు డీఈవో రోహిణి తెలిపారు.