శేరిలింగంపల్లి,ఆగ స్టు 16: గత కొన్ని రోజులగా అనారోగ్యంతో రాయదుర్గంలోని సన్‌షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రముఖ చలనచిత్ర నటుడు ప్రకాశ్‌రాజ్ సోమవారం కోలుకొనిహాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యా రు. ఈ విషయాన్ని ప్రకాష్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోను హాస్పిటల్ సీఏండీ డాక్టర్ గురువారెడ్డి సామాజిక మాద్యమాల్లో పంచుకున్నారు. నా మంచి మిత్రుడు, ప్రముఖ చలనచిత్ర నటుడు ప్రకాశ్‌రాజ్ ఈ రోజు డిశ్చార్జి అవుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరగా ప్రకాశ్‌రాజ్ కోలుకొని తిరిగి సిల్వర్ స్క్రిన్‌పై చూడాలని కోరుకుంటున్నట్లు డాక్టర్ గురువారెడ్డి పేర్కొన్నారు.