సుల్తాన్‌బజార్, ఆగస్టు 30: ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి పవర్ గ్రి డ్ కార్పొరేషన్ చేయూతను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేర కు మంగళవారం దవాఖాన ఆడిటోరియంలో దవాఖానలోని పలు విభాగాలలో అవసరమయ్యే రూ.3 కోట్ల 90లక్షల విలువైన అధునాతనమైన 22 రకాల వైద్య పరికరాలను అందించేందుకు గాను పవర్ గ్రిడ్ కార్పొరేష న్ ఇండిపెండెంట్ డైరెక్టర్ చేతన్ బన్సల్ కంకారియా, ఉస్మానియా దవాఖా న సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్‌తో ఎంవోయూ ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ మాట్లా డు తూ, ఉస్మానియా దవాఖానలో వైద్య చికిత్సలు పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు గాను అధునాతనమైన వైద్య పరికరాలను అందించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ దక్షిణ ప్రాంతం-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాత్సవ, హెచ్‌వోపీ సీనియర్ జీఎం(హెచ్ఆర్) పీకే హరినారాయణ్, సీనియర్ జీఎం జీవీ రావు, ఉస్మానియా దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, దవాఖాన సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ రమేశ్, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జున్, న్యూరో సర్జన్ వైద్యులు డాక్టర్ శ్రీధరాల శ్రీనివాస్‌తో పాటు ఆర్ఎంవోలు డాక్టర్ రఫీ, డాక్టర్ కవిత, డాక్టర్ మాధవితో పాటు వైద్యులు పాల్గొన్నారు.