Power Supply | బేగంపేట్, ఆగస్టు 12: విద్యుత్ లైన్లలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏడీఈ కార్యాలయం పరిధిలో నిర్ధేశించిన సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ అధికారులు తెలిపారు. డివిజన్లోని బన్సీలాల్‌పేట్, మోండామార్కెట్ సబ్స్టేషన్ల పరిధిలోని రేపు (బుధవారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. ప్రధానంగా ఓల్డ్ జైల్ఖాన ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 వరకు ఓల్డ్ జైలు ఖాన, సిటీలైట్ హోటల్, విక్టోరియా రాణిగంజ్, అంజయ్య కాంప్లెక్స్ ప్రాంతాలు, అలాగే కేవీ పాలిక బజార్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాలికబజార్, సౌత్ ఇండియా చర్చ్, ప్రకాష్ ఆసుపత్రి ఏరియా, అఫ్జల్ అల్లావుద్దీన్ క్రిస్టల్ ప్లాజా ఏరియా ప్రాంతాల్లో విద్యుత్ నిలిపి వేయనున్నట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.