Power Cuts | మణికొండ, మార్చి 22 : గత ఏడాదిన్నర క్రితం కరెంటు పోతే వార్త .. ఇప్పుడు కరెంటు వస్తే వార్తలా మారింది పరిస్థితి. వేసవి కాలం ఆరంభం నుంచి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ వట్టి నాగులపల్లి తదితర గ్రామాలలో విద్యుత్ సరఫరాలో నిరంతరం అంతరాయం ఏర్పడుతుంది. రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో ఇంట్లో కరెంటు లేక ఫ్యాన్లు తిరగక ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరై పోతున్నారు.
ఎందుకు ఇలా కరెంటు కోతలు జరుగుతున్నాయని సంబంధిత అధికార యంత్రాంగాన్ని అడిగేందుకు ఫోను చేస్తే వారు ఫోను ఎత్తడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం వేసవికాలంలో క్షణం పాటు కూడా కరెంటు పోయిన దాఖలాలు కనిపించలేదని ఇప్పుడు ఎందుకు కోతలు జరుగుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం రాత్రి చిన్నపాటి చినుకులతో వర్షం పడటంతో ఈ ప్రాంతంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రత్యామ్నాయ మార్గంగా విద్యుత్ సరఫరాను అందించిన సిబ్బంది తెల్లవారిన తర్వాత విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందంటూ రోజుకు 10 నుంచి 15 సార్లు సరఫరా ట్రిప్ అవుతున్నట్లు సిబ్బంది తెలిపారు. ఎందుకు ఇలా జరుగుతుందో ముందస్తుగానే చర్యలు తీసుకోవలసిన విద్యుత్ శాఖ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ప్రజలు అంటున్నారు. మొన్నటి వరకు విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు ఆలుతున్నాయంటూ గత మూడు మాసాలుగా ట్రీ కటింగ్ పేట విద్యుత్ సరఫరాను గంటల తరబడి నిలిపివేసిన అధికారులు ఇప్పుడు చిన్నపాటి చినుకుల వర్షం కురిస్తేనే విద్యుత్ సరఫరా ఆగిపోయిందని తెలపడం వారి పనితనానికి నిదర్శనమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
మూడు మాసాలుగా చెట్ల కొమ్మలు మరకవేత్తల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించిన ఇదే యంత్రాంగం ఇప్పుడు చిరు గాలులతో కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా ట్రిప్ అవుతుందని తెలుపుతున్నారంటే భవిష్యత్తులో కురిసే భారీ వర్షాలకు ఏ విధమైన ముందస్తు చర్యలను ఈ అధికారులు తీసుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే రోజుకు దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసే చర్యల్లో భాగంగానే ఈ పరిస్థితులను ప్రజలకు అలవాటు చేసేందుకు అంతరాయం పేరిట విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిసింది. మండుతున్న ఎండలో వైపు కరెంటు లేక మరోవైపు పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ప్రతిరోజు ఉడకపోతకు ముఖ్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రాంతంలో కొనసాగుతున్న విద్యుత్ సరఫరా అంతరాయం పై చొరవ చూపాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.